prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 3:03 pm Digital Edition : PRAJA VANI

అమ్మవారికి.. బంగారు కానుక

*అమ్మవారికి.. బంగారు కానుక!

*మూడు తులాల బంగారు నెక్లెస్‌ సమర్పించిన శ్రీధర్‌కుమార్ కుటుంబ సభ్యులు

అమీన్పూర్,సెప్టెంబర్‌ 18 (ప్రజావాణి):బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి రెయిన్బో మెడోస్‌, బీరంగూడకు చెందిన వి. శ్రీధర్‌కుమార్ కుటుంబ సభ్యులు మూడు తులాల బంగారు నెక్లెస్‌ను భక్తి కానుకగా సమర్పించారు.
ఆలయ చైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌, ఆలయ అధికారుల సమక్షంలో శ్రీధర్‌కుమార్ కుటుంబ సభ్యులు బంగారు నెక్లెస్‌ను ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్‌కు అందజేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నెక్లెస్‌ను అమ్మవారి అలంకరణ కోసం ఆలయానికి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌ మాట్లాడుతూ భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక భావనలకు ఇలాంటి కానుకలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనకు భక్తుల సహకారం అభినందనీయమని తెలిపారు.
కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, శ్రీధర్‌కుమార్ కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.