prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:52 am Digital Edition : PRAJA VANI

అమ్మపేట విఘ్నేశ్వరునీ వద్ద అన్నదాన కార్యక్రమం

అమ్మపేట విఘ్నేశ్వరునీ వద్ద అన్నదాన కార్యక్రమం
ముదిగొండ సెప్టెంబర్ 23 ప్రజావాణి ప్రతినిధి
ముదిగొండ మండల పరిధి లోని అమ్మపేట గ్రామంలో ఎస్సీ కాలనీలోని ఊటుకూరి ముత్తయ్య సెంటర్లో విగ్నేశ్వర యూత్ కమిటీ వారిచే ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి మహా అన్నదాన కార్యక్రమాన్ని దాతలు చెంగపొంగు వెంకటేశ్వర్లు కుమారులు చెంగపొంగు సైదులు-రాణి, చెంగపొంగు శ్రీను-పుష్ప రాణి దంపతులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సందర్భన్నీ ఉద్దేశించి మాట్లాడుతూ నవరాత్రి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో భక్తులు జరుపుకోవడం దానిలో భాగంగా సేవా కార్యక్రమం గా మేము అన్నదానం జరపటం ఎంతో సంతోషాన్నిచ్చాయని వారు కొనియాడారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకపోతుల వెంకయ్య, మత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వడ్డెల్లి వీర రాఘవులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డెల్లి రామారావు (నాగయ్య) ఉపసర్పంచ్ ఊటుకూరి గోపయ్య, మాజీ ఉప సర్పంచ్ రేగళ్ల అప్పారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఊటుకూరి సాదు, బెజవాడ మోహన్ రావు కమిటీ సభ్యులు చంగ పంగు తరుణ్, శివమణి సతీష్ అరవింద్ జస్వంత్ విక్రం రాము, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు