prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 4:59 pm Digital Edition : PRAJA VANI

అమావాస్య నాడు మాత్రమే తెరుచుకునే అద్భుతం

*అమావాస్య నాడు మాత్రమే తెరుచుకునే అద్భుతం*
– పోచాపూర్ బోలేషే వాలీ దర్గా చరిత్ర.

*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌(ప్రజావాణి)*
ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం అటవీ ప్రాంతంలో వెలసిన మహిమాన్విత క్షేత్రం పోచాపూర్ బోలేషే వాలీ దర్గా.సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన సూఫీ సాధువు బోలేషే వాలీ బాబా ఇక్కడే తపస్సు చేసి సమాధి అయ్యారని పెద్దలు చెబుతారు.
ఆనాటి నుండి ఈ ప్రదేశం మహిమాన్వితంగా మారిందని భక్తుల నమ్మకం.
ఈ దర్గా అత్యంత శక్తివంతమైనదని, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈ దర్గాకు ఒక ప్రత్యేక నియమం ఉంది. నెలలో 29 రోజులు మూసి ఉండి, కేవలం అమావాస్య రోజు మాత్రమే తెరుస్తారు.
అమావాస్య నాడు తెల్లవారుజాము నుండే దర్గా వద్ద భక్తుల రద్దీ మొదలవుతుంది.తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు,ఏటూరునాగారం నుండే కాకుండా వరంగల్, ఖమ్మం,ఇల్లందు,పాల్వంచ, విజయవాడ జిల్లాల నుండి కూడా భక్తులు వస్తారు.
హిందూ ముస్లిం భేదం లేకుండా అందరూ కలిసి దర్గాను దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
సంతానం లేనివారు, అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడ మొక్కుకుంటే ఫలితం ఉంటుందని ప్రతీతి.
దర్గాలోని మట్టిని తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకుంటే శుభం జరుగుతుందని నమ్ముతారు.అమావాస్య రోజున దర్గా వద్ద ప్రత్యేకంగా అన్నదానం కూడా నిర్వహిస్తారు.
దర్గా నిర్వహణను స్థానిక గ్రామ పెద్దలు, వక్ఫ్ బోర్డు సంయుక్తంగా చూసుకుంటున్నారు.
ఒకప్పుడు దట్టమైన అడవిలో ఉన్న ఈ దర్గాకు ఇప్పుడు రోడ్డు సౌకర్యం కూడా ఏర్పడింది.
ప్రతి నెల అమావాస్యకు 5 వేలకు పైగా భక్తులు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.మత సామరస్యానికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా ఈ దర్గా నిలుస్తోంది.
ప్రకృతి ఒడిలో, ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దర్గా సందర్శన మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది.

Score: శ్రీకాంత్ రిపోర్టర్‌