prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 9:35 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

అమరావతిలో ఘనంగా టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్: బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరు

మంగళగిరి సెప్టెంబర్ 7 ప్రజావాణి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్’ విజయవంతంగా ముగిసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ,  ఘనంగా టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్: బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలుగుదేశం పార్టీని మరింత వ్యవస్థీకృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు ప్రతిష్ఠాత్మక ‘లీడర్‌షిప్ కాంక్లేవ్’ (నాయకత్వ సదస్సు) నిర్వహించారు.ఈ ఉన్నత స్థాయి రాజకీయ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జులు హాజరయ్యారు.ఈ క్రమంలో బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఈ కాంక్లేవ్‌లో పాల్గొని, నియోజకవర్గ పరిస్థితులను మరియు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో,జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ పర్యవేక్షణలో ఈ సదస్సు సుదీర్ఘంగా సాగింది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలోకి, ప్రతి ఇంటికీ ఎలా తీసుకెళ్లాలనే అంశంపై నాయకులకు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అధినేత అందించారు. “కార్యకర్తలే పార్టీకి ప్రాణం, నాయకులే దానికి దిక్సూచి” అనే నినాదంతో ప్రజా సేవలో ఎక్కడా రాజీ పడకూడదని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.సంస్థాగత బలోపేతం – ప్రజా సేవపై విస్తృత చర్చ

ఈ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ప్రధానంగా మూడు అంశాలపై విస్తృతంగా చర్చించారు:

1. పార్టీ సంస్థాగత బలోపేతం: గ్రామ, మండల స్థాయిల్లో కమిటీలను మరింత బలోపేతం చేయడం, పాత-కొత్త నాయకత్వాల మధ్య సమన్వయం సాధించడం.

2. ప్రభుత్వ పథకాల విస్తరణ: కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం.

3. ప్రజా సమస్యల పరిష్కారం: స్థానిక సమస్యలను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా బాధ్యతాయుతంగా పనిచేయడం.

బద్వేల్ ప్రగతికి సంకల్పం: మంచూరు సూర్యనారాయణ రెడ్డి

సదస్సు అనంతరం బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని అజేయమైన శక్తిగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను ఆదుకుంటూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సమష్టిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కాంక్లేవ్‌లో లభించిన దిశానిర్దేశం రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్‌చార్జులు మరియు కడప జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.