prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 3:52 pm Digital Edition : PRAJA VANI

అభివృద్ధి పనుల్లో ఆనంద్‌రావు దూకుడు

అభివృద్ధి పనుల్లో ఆనంద్‌రావు దూకుడు

కూకట్‌పల్లి విలేజ్‌లో మౌలిక వసతులకు కొత్త రూపు

స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌లపై ప్రత్యేక దృష్టి

కూకట్‌పల్లి విలేజ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 13

కూకట్‌పల్లి విలేజ్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మొలుగు ఆనంద్‌రావు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఇప్పటివరకు చేపట్టని విధంగా స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఫుట్‌పాత్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పనులు చేపడుతున్నారు.
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజలకు మంచి జరగాలన్నదే తన ప్రధాన లక్ష్యమని ఆనంద్‌రావు పేర్కొంటూ, కూకట్‌పల్లి విలేజ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.