అప్పుల్లో ఏపీ సర్కార్ సరికొత్త రికార్డు: చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఘాటు విమర్శలు
పోరుమామిళ్ల సెప్టెంబర్ 24 ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి,పెరుగుతున్న అప్పుల విధానంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం 27 నెలల స్వల్ప వ్యవధిలోనే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల సమీపానికి చేరుకుని, రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన విమర్శించారు.ఎన్నికల ముందు 'సంపద సృష్టిస్తాం' అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, ఇప్పుడు కేవలం 'అప్పులు సృష్టించడమే' పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.గురువారం...