వినాయక చవితి సందర్భంగా నాగారం మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగారం వార్డు కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు భోజనం వడ్డించి, వారి సేవలను అభినందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సతీష్ రెడ్డి, నాగారం మున్సిపల్ మాజీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాగారం మాజీ కౌన్సిలర్ కౌకుట్ల అనంతరెడ్డి, మాజీ వార్డు సభ్యులు సాయినాథ్ గౌడ్, కొండల్ రెడ్డి, కీసర మండల సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే ఎర్ర పురుషోత్తం, బండారి నర్సింగరావు, శ్రీకాంత్, ప్రవీణ్, విగ్రహాదాత నవీన్ తదితరులు పాల్గొన్నారు.
పురుషోత్తం, నర్సింగరావు, ప్రవీణ్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.