prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:40 pm Digital Edition : PRAJA VANI

అనుమతుల ఉల్లంఘనపై డీజేలపై కేసు

*అనుమతుల ఉల్లంఘనపై డీజేలపై కేసు*

*బీరంగూడలో మూడు డీజే వాహనాలు, భారీ డిజిటల్‌ స్క్రీన్లు*

*అధిక శబ్దంపై పోలీసుల అభ్యంతరం.. పలువురిపై కేసు నమోదు*

అమీన్‌పూర్‌, సెప్టెంబర్‌ 28 (ప్రజావాణి):వినాయక నిమజ్జనం సందర్భంగా బీరంగూడలో డీజేలు, భారీ డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటుకు సంబంధించి అనుమతుల నిబంధనల ఉల్లంఘనపై అమీన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బీరంగూడ ప్రభుత్వ పాఠశాల సమీపంలోని నందారం నరసింహ గౌడ్‌ ఇంటి వద్ద మూడు డీజే వాహనాలతో సౌండ్‌ సిస్టమ్‌, భారీ డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 27 సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటల వరకు డీజేలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన అనుమతులపై పోలీసులు పరిశీలన చేపట్టారు. అధిక శబ్దంతో సౌండ్‌ సిస్టమ్‌ వినియోగించడం, రోడ్డుపై భారీ డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పెట్రోలింగ్‌లో ఉన్న అమీన్‌పూర్‌ పోలీసు సిబ్బంది ఈ ఏర్పాట్లను గుర్తించిన అనంతరం మూడు డీజే వాహనాలను, వాటి యజమానులు, సంబంధిత డీజే ఆపరేటర్లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. అనంతరం నిబంధనల మేరకు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
డీజే వాహనాలు
AP 39 TC 7569 – యజమాని ఇస్సాక్‌
AP 12 V 0661 – యజమాని స్యామ్సన్‌
TS 12 EJ 6440 – యజమాని విజయ్‌
ఈ ఘటనకు సంబంధించి నందారం నరసింహ గౌడ్‌, సంబంధిత డీజే వాహనాల యజమానులు, డీజే ఆపరేటర్లపై BNS సెక్షన్లు 223, 285, 270, 292, 126(2), 3(5) కింద కేసు నమోదు చేసినట్లు అమీన్‌పూర్‌ పోలీసులు తెలిపారు.