అనుమతి లేకుండా ఫ్లెక్సీల ముద్రణ, ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ముద్రించడం, ఏర్పాటు చేయడాన్ని సహించేది లేదని మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ స్పష్టం చేశారు. కమిషనర్ ఛాంబర్‌లో ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి పత్రాన్ని పరిశీలించిన అనంతరం మాత్రమే ఫ్లెక్సీలను ముద్రించాలని సూచించారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, వ్యక్తులు లేదా ఇతర సంస్థల నుంచి ఆర్డర్లు వచ్చినప్పటికీ ఇదే నిబంధనను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి...