prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 6:52 pm Digital Edition : PRAJA VANI

అనిల్‌గౌడ్‌.. సేవా స్ఫూర్తికి చిరునామా

*అనిల్‌గౌడ్‌.. సేవా స్ఫూర్తికి చిరునామా!

*కుమార్తె చిరస్వి గౌడ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకే రోజు మూడు సేవా కార్యక్రమాలు*

అమీన్‌పూర్, సెప్టెంబర్‌ 20 (ప్రజావాణి):పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా.. సేవా కార్యక్రమాలతో అర్థవంతంగా నిర్వహించారు ఎస్‌ఏజీ యువసేన నిర్వాహకుడు ఎస్‌. అనిల్‌గౌడ్‌ కుటుంబ సభ్యులు. ఆయన కుమార్తె చిరస్వి గౌడ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకే రోజు మూడు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం ఎన్టీఆర్‌ కాలనీలోని మహిమ అనాథాశ్రమంలో చిన్నారులతో ఆత్మీయంగా గడిపి అల్పాహారం అందించారు. మధ్యాహ్నం జవహర్‌నగర్‌లో అన్నదానం నిర్వహించగా.. రాత్రి అమీన్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి షెడ్డులో భక్తులకు అన్నప్రసాదం అందించారు.

*అనాథ పిల్లలతో ఆత్మీయంగా..*

ఉదయం మహిమ అనాథాశ్రమాన్ని సందర్శించిన అనిల్‌గౌడ్‌ కుటుంబ సభ్యులు చిన్నారులతో కొంతసేపు ఆత్మీయంగా గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని అల్పాహారం అందించారు. చిన్నారులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

*జవహర్‌నగర్‌లో అన్నదానం*

అనంతరం జవహర్‌నగర్‌ కాలనీలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనిల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
వినాయకుడి సన్నిధిలో అన్నప్రసాదం
రాత్రి అమీన్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి షెడ్డులో మరో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయకుడిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

‘‘పుట్టినరోజు అంటే.. ఆనందాన్ని పంచుకోవడమే’’

ఈ సందర్భంగా ఎస్‌. అనిల్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తన కుమార్తె చిరస్వి గౌడ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అనాథ పిల్లలతో అల్పాహారం, జవహర్‌నగర్‌లో అన్నదానం, వినాయకుడి సన్నిధిలో అన్నప్రసాదం అందించడం ద్వారా పుట్టినరోజు ఆనందాన్ని పలువురితో పంచుకున్నామని చెప్పారు.
పుట్టినరోజు అంటే కేవలం మన ఆనందాన్ని జరుపుకోవడం మాత్రమే కాదని.. మన సంతోషంలో కొంత భాగాన్ని ఇతరులతో పంచుకోవడమే నిజమైన వేడుక అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల విజయవంతానికి నరేష్‌, రమేష్‌, భరత్‌, రమేష్‌ అన్న, పి. శివకుమార్‌, ఎస్‌. శివ, చింటూ, వంశీ, పి. మహేష్‌, తరుణ్‌, ప్రవీణ్‌ (బ్రో), రాజేష్‌, నాని, మహేష్‌ తదితరులు సహకరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్‌, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కాటా సుధారాణి హాజరు కావాల్సి ఉండగా.. ఇతర కార్యక్రమాలు, ముందస్తు పనుల కారణంగా హాజరు కాలేకపోయారు. అయితే నిర్వాహక కుటుంబానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
ఒకే రోజు.. మూడు సేవా కార్యక్రమాలతో కుమార్తె పుట్టినరోజును నిర్వహించిన అనిల్‌గౌడ్‌ కుటుంబం సేవా స్ఫూర్తిని చాటిందని స్థానికులు అభినందించారు.