prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 8:54 am Digital Edition : PRAJA VANI

అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న బలబద్ర రామారావు అనే వ్యక్తి మృతి

అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న బలబద్ర రామారావు అనే వ్యక్తి మృతి

జమ్మికుంటసెప్టెంబర్ 27 (ప్రజావాణి)

జమ్మికుంటమున్సిపల్.పరిధిలోనిమోత్కులగూడెం గ్రామంలో గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న బలబద్ర రామారావు (60) అనే వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు బతుకుతెరువు కోసం నాలుగు సంవత్సరాల కిందట ఇక్కడకు వచ్చి స్థిరపడిన ఆయన బి.పి షుగర్ వంటి వ్యాధుల తీవ్రతతో తరచూ జీవితంపై విరక్తి వ్యక్తం చేసేవాడు. ఇటీవల కూతురి ప్రసవం నిమిత్తం భార్య శివమ్మ నరసరావుపేట వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న రామారావు ఒకరోజు ముందు బాత్‌రూంలో కిందపడిపోగా స్థానికులు గమనించి ఆయన భార్యకు సమాచారం అందించారు మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి మంచంపై గొంతు కోసుకొని రక్తమడుగులో పడివుండటంతో స్థానికుడు పొనగంటి రాము సహాయంతో వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు ప్రారంభించారు