అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్‌కు తోటి సర్పంచుల ఆర్థిక సాయం సుమారు రూ.2.50 లక్షల సహాయం అందజేత
నంగునూరు, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటి సర్పంచ్ కుటుంబానికి నంగునూరు మండలంలోని పలువురు సర్పంచులు అండగా నిలిచారు. నంగునూరు మండలం అప్పలాయచెరువు గ్రామ సర్పంచ్ పెద్దమ్మల సత్యం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై గత 20 రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, నాయకులు మానవతా దృక్పథంతో స్పందించారు. ఆసుపత్రికి వెళ్లి సర్పంచ్...