prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:37 pm Digital Edition : RAJU NANGUNOOR

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్‌కు తోటి సర్పంచుల ఆర్థిక సాయం సుమారు రూ.2.50 లక్షల సహాయం అందజేత

నంగునూరు, సెప్టెంబర్ 16 (ప్రజావాణి):

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటి సర్పంచ్ కుటుంబానికి నంగునూరు మండలంలోని పలువురు సర్పంచులు అండగా నిలిచారు. నంగునూరు మండలం అప్పలాయచెరువు గ్రామ సర్పంచ్ పెద్దమ్మల సత్యం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై గత 20 రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, నాయకులు మానవతా దృక్పథంతో స్పందించారు. ఆసుపత్రికి వెళ్లి సర్పంచ్ సత్యం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్సకు అవసరమైన ఖర్చులకు తోడ్పాటుగా సుమారు రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆపద సమయంలో తోటి సర్పంచులు తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించడం పట్ల సత్యం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ సత్యం త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.