అద్వాన్న స్థితిలో మూత్రశాలలు
పంచాయతీ పక్కనే అద్వాన్న స్థితిలో మూత్రశాలలు భిక్కనూర్, సెప్టెంబర్ 18 (ప్రజావాణి) గ్రామ ప్రజలకు కనీస వసతులు కల్పించాల్సిన గ్రామపంచాయతీ అధికారులు ప్రజా సౌకర్యాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిదర్శనంగా పెద్ద మల్లారెడ్డి గ్రామపంచాయతీ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ప్రజా మూత్రశాలల దుస్థితి కనిపిస్తోంది. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన మూత్రశాలలు ప్రస్తుతం సరైన నిర్వహణ లేక అపరిశుభ్రంగా మారినట్లు స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ప్రజా సౌకర్యం ఈ స్థాయిలో నిర్లక్ష్యానికి గురవుతుంటే.....