అద్భుత దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో భక్తి, అభిమానం, పరిపాలనా సౌధం
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ప్రజావాణి):హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన వేళ కెమెరాకు చిక్కిన ఓ అద్భుతమైన దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. ఆకాశం, నీరు, వినాయక విగ్రహం, నగర నిర్మాణాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తూ ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఈ చిత్రంలో వినాయక విగ్రహం భక్తికి ప్రతీకగా నిలుస్తుండగా.. భక్తుల సందడి, గణనాథుడిపై ఉన్న ప్రేమాభిమానాలు అభిమానానికి ప్రతీకగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో వెనుక భాగంలో కనిపిస్తున్న ప్రభుత్వ పరిపాలనా భవనం పాలనకు ప్రతీకగా నిలుస్తోంది.భక్తి.. గణనాథుడిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది.అభిమానం.. వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు...