prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 1:27 pm Digital Edition : PRAJA VANI

అత్యవసరమైతేనే మండల ప్రజలు బయటకు రావాలి: చిలుకూరు ఎస్ఐ

*అత్యవసరమైతేనే మండల ప్రజలు బయటకు రావాలి: చిలుకూరు ఎస్ఐ*

చిలుకూరు సెప్టెంబర్ 23(ప్రజావాణి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిలుకూరు మండల ఎస్ఐ బండి మోహన్ బాబు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రహదారులపై ప్రయాణించే వాహనదారులు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వెళ్లాలని,.నీరు ప్రవహిస్తున్న రహదారులు, వాగులు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాలను దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు చెరువులు, కుంటలు, కాలువలు, వాగుల వద్దకు వెళ్లకూడదని . తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, తడిసిన విద్యుత్ పరికరాలను ముట్టుకోవద్దని,భారీ వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో రైతులు పొలాలకు వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, వ్యవసాయ మోటార్లు, విద్యుత్ ప్యానెళ్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని,పాత భవనాలు, శిథిల గోడలు, చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.రోడ్లపై ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, ట్రాఫిక్ ఆంక్షలు, పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.చిలుకూరు ఎస్‌ఐ బండి మోహన్‌బాబు: ప్రమాదకర ప్రాంతాల్లో చిక్కుకున్నవారు స్వయంగా ప్రమాదాన్ని ఎదుర్కోకుండా వెంటనే పోలీసుల సహాయం కోరాలని తెలిపారు. “మీ భద్రతే మా బాధ్యత.. మీ అప్రమత్తతే మీ రక్షణ” అని పేర్కొన్నారు.