
*రేగొండ, సెప్టెంబర్ 22 (మన ప్రజావాణి):* జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి ఐలుస్వామి చిన్న కుమారుడు అఖిల్ (20) అకాల మృతి చెందిన విషయం తెలిసిందే.
అఖిల్ అకాల మృతికి చింతిస్తూ తిరుమలగిరి గ్రామ ముదిరాజ్ సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి ఆర్థిక సాయంగా *రూ.5,000* అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ చిన్న వయసులోనే అఖిల్ మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి ముదిరాజ్ సంఘం అండగా ఉంటుందని తెలిపారు.