అక్షిర జన్మదిన వేడుకల సందర్భంగా మహా అన్నదానం

అక్షిర జన్మదిన వేడుకల సందర్భంగా మహా అన్నదానం ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 22 కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గాదె రామ్మోహన్ రెడ్డి, శ్రీమతి మీనాదేవి దంపతుల పెద్ద మనవరాలు గాదె అక్షిర 13వ జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నప్పటికీ గత పది సంవత్సరాలుగా అక్షిర జన్మదినం సందర్భంగా పెద్ద పోచారం గ్రామంలో క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహిస్తున్నారు....