prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 3:52 pm Digital Edition : PRAJA VANI

అక్షిర జన్మదిన వేడుకల సందర్భంగా మహా అన్నదానం

అక్షిర జన్మదిన వేడుకల సందర్భంగా మహా అన్నదానం
ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 22
కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గాదె రామ్మోహన్ రెడ్డి, శ్రీమతి మీనాదేవి దంపతుల పెద్ద మనవరాలు గాదె అక్షిర 13వ జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నప్పటికీ గత పది సంవత్సరాలుగా అక్షిర జన్మదినం సందర్భంగా పెద్ద పోచారం గ్రామంలో క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై మహా అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం అక్షిరకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, పాప , కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువత పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.