అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి- మహీంద్రా ట్రాక్టర్ సీజ్.. డ్రైవర్‌పై కేసు నమోదు

కోహెడ, సెప్టెంబర్ 2 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మహీంద్రా ట్రాక్టర్‌ను కోహెడ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. తంగళ్లపల్లి గ్రామంలోని మోయతుమ్మెద వాగు నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కోహెడ పోలీసులు దాడి చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. మహీంద్రా యూవోటెక్ ట్రాక్టర్ (TG-36-T-3639), ట్రాలీ (TS-36-8201)ను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ తంగళ్లపల్లి గ్రామానికి చెందిన మౌటం...