అక్రమ ఇసుక రవాణాపై కోహెడ పోలీసుల దాడులు రెండు ఇసుక ట్రాక్టర్లు, రెండు బొలెరో వాహనాలు సీజ్
కోహెడ, సెప్టెంబర్ 8 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై కోహెడ పోలీసులు దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని తంగళ్లపల్లి, వింజపల్లి గ్రామాల పరిధిలోని మోయ తుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.ఈ దాడుల్లో రెండు ఇసుక ట్రాక్టర్లు, రెండు బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన వాహనాల్లో తరలిస్తున్న ఇసుకకు సంబంధించి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి...