prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 6:43 pm Digital Edition : PRAJA VANI

అక్టోబర్ 2న జనగామలో నల్ల నర్సింహులు శతజయంతి వేడుకలు

*అక్టోబర్ 2న జనగామలో నల్ల నర్సింహులు శతజయంతి వేడుకలు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి):
అక్టోబర్ 2న జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సబ్బండ వర్గాల ఆశాజ్యోతి, పద్మశాలి ముద్దుబిడ్డ నల్ల నర్సింహులు శతజయంతి వేడుకలను పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఐక్యమై విజయవంతం చేయాలని మన ఆలోచన – మన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింహులు పిలుపునిచ్చారు.

శనివారం రఘునాథపల్లి మండల కేంద్రంలో నల్ల నర్సింహులు శతజయంతి ఉత్సవాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన కటకం నర్సింహులు మాట్లాడుతూ బలహీన, అట్టడుగు, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సమాజ అభివృద్ధికి కృషి చేసిన మేధావులను స్మరించుకుంటూ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

అక్టోబర్ 2న జనగామ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా సూర్యాపేట రోడ్డులో ఉన్న నల్ల నర్సింహులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బతుకమ్మ కుంటలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని వివిధ వర్గాలు ఐకమత్యంతో ముందుకు సాగేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు.

గ్రామగ్రామాన నల్ల నర్సింహులు విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గునిగంటి చంద్రశేఖర్ గౌడ్, పూస రవి గంగపుత్ర, సింగార రవీందర్, పిట్టల సత్యం, వంగ రవి, రఘునాథపల్లి సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్, సీనియర్ జర్నలిస్ట్ చింతకింది కృష్ణమూర్తి, కరిమికొండ వెంకటేశ్వర్లు, గుండా కృష్ణమూర్తి, చింతకింది బిక్షపతి, గుండ మధుసూదన్, చింతకింది లక్ష్మీనారాయణ, యాదగిరి, కరీంకొండ సిద్దయ్య, నూనె ముంతల లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.