*అంబేద్కర్ జగ్జీవన్ రావు కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమం*
*33 ఏళ్లుగా గణేష్ ఉత్సవాల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న అంబేద్కర్ యువజన సంఘం*
*అన్నదానాన్ని ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్*
గుండ్లపోచంపల్లి, సెప్టెంబర్ 23 ప్రజా వాణి
: గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ జగ్జీవన్ రావు కాలనీలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద బుధవారం ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సాయిపేట శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గత 33 సంవత్సరాలుగా కాలనీలో గణేష్ ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మూడు దశాబ్దాలకు పైగా గణేష్ ఉత్సవాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్న పెద్దలు, యువతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భక్తి, సేవా భావంతో ఉత్సవాలను నిర్వహిస్తూ సమాజంలో ఐక్యతను చాటడం సంతోషకరమైన విషయమన్నారు.
యువత ఐకమత్యంతో ముందుకు సాగుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులు, కాలనీ ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులను అభినందించారు.
అనంతరం గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, కాలనీ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమంలో కాలనీ ప్రజలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భోజన ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా యువతను సమన్వయం చేసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, వడ్డే ప్రవీణ్, కొమ్ము రాజు, రాకేష్, చింటూ, ప్రవీణ్, నటరాజ్, మధు, మహిపాల్, పండు, ఉదయ్, ఆనంద్, మురళీ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.