అంబేద్కర్‌పై వ్యాఖ్యలకు భగ్గుమన్న దళిత సంఘాలు
బాన్సువాడలో ధర్నా, రాస్తారోకో.. దిష్టిబొమ్మ దగ్ధం చేసి చట్టపరమైన చర్యలకు డిమాండ్
బాన్సువాడ,: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భారత రాజ్యాంగంపై అమర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాన్సువాడ డివిజన్ దళిత సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాన్సువాడ డివిజన్ అంబేద్కర్ సంఘం, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అమర ప్రసాద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, ఆయనపై పుస్తకం రాసి ఈ నెల 18న విడుదల చేస్తామని ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని, కుల, మతాల మధ్య విద్వేషాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తక విడుదల అంశంపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అంబేద్కర్, భారత రాజ్యాంగాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర ప్రసాద్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నక్క విజయ్, డివిజన్ అధ్యక్షుడు దేశాయ్‌పేట్ ప్రశాంత్, కౌన్సిలర్ దొనకంటి వెంకటేష్, దళిత సంఘాల రాష్ట్ర నాయకులు బంగారు సాయిలు, కాదెపురం గంగారాం, బంగారు మైసయ్య, సంధుల గంగారం, రవీందర్, జిల్లా నాయకులు రుశేగం భూమయ్య, బండి విజయ్, డివిజన్ నాయకులు మల్లూరు సాయిలు, మన్నే చిన్న సాయిలు, ఆర్టీసీ మారుతి, సంబాపూర్ రవి, దేశాయ్‌పేట్ గంగాధర్, డాక్టర్ సాయిలు, పరుశురాం, ఆంజనేయులు, హరిప్రసాద్, మీర్జాపూర్ శ్రీను, పోశెట్టి, మామిడి భూమయ్య, బుడ్మి గంగారాం, కమ్మరి నర్సింలు, మన్నే నాగభూషణం, పోతురాజు లింగం, మన్నే సాయి ప్రసాద్, నీరడి రాములు తదితరులు పాల్గొన్నారు.