*అంబేద్కర్‌పై పుస్తకాన్ని ఖండించిన బీఎస్పీ*
*హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం: (ప్రజా వాయిస్) సెప్టెంబర్ 16
తుర్కయంజల్: డా. బీఆర్ అంబేద్కర్‌పై ‘‘కల్పిత నాయకుడు’’ పేరుతో పుస్తకం రాస్తున్న హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. తుర్కయంజల్ మున్సిపాలిటీ మాజీ ఉపాధ్యక్షుడు లపంగి రాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు, న్యాయవాది పట్నం రమేష్ కురుమ మాట్లాడారు.
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని అన్ని వర్గాలకు హక్కులు, రక్షణ లభిస్తున్నాయని, రాజ్యాంగ నిర్మాతను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. అనంతరం హమారా ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి, ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎస్. రమేష్, మల్లెల రఘు, భూతం రమణ, గుడ్ల తిరుమలేశ్, అమరవరం రవికుమార్, ప్రసాద్, కృష్ణ, భాస్కర్, శ్రీకాంత్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.