అంబేడ్కర్‌పై పుస్తకాన్ని నిరసిస్తూ విద్యాసంస్థల మూసివేత* *పుస్తకాన్ని నిషేధించాలని ప్రజా సంఘాల డిమాండ్* *హమారా ప్రసాద్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలి*
నంగునూరు, సెప్టెంబర్ 18: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై హమారా ప్రసాద్ రాసిన పుస్తకాన్ని నిరసిస్తూ నంగునూరు మండలం మగ్ధూంపూర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హమారా ప్రసాద్ రాసిన పుస్తకంలోని అంశాలపై దళిత సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను అవమానించేలా ఉన్న పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.నిరసనలో భాగంగా గ్రామంలోని పాఠశాలల్లో తరగతులను బహిష్కరించారు.విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు.మాల మహానాడు జిల్లా నాయకుడు అల్లిబిల్లి...