prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:29 pm Digital Edition : RAJU NANGUNOOR

అంబేడ్కర్‌పై పుస్తకాన్ని నిరసిస్తూ విద్యాసంస్థల మూసివేత* *పుస్తకాన్ని నిషేధించాలని ప్రజా సంఘాల డిమాండ్‌* *హమారా ప్రసాద్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలి*

నంగునూరు, సెప్టెంబర్‌ 18: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై హమారా ప్రసాద్‌ రాసిన పుస్తకాన్ని నిరసిస్తూ నంగునూరు మండలం మగ్ధూంపూర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హమారా ప్రసాద్ రాసిన పుస్తకంలోని అంశాలపై దళిత సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను అవమానించేలా ఉన్న పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేశారు.నిరసనలో భాగంగా గ్రామంలోని పాఠశాలల్లో తరగతులను బహిష్కరించారు.విద్యాసంస్థలను మూసివేయించారు.

ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు.మాల మహానాడు జిల్లా నాయకుడు అల్లిబిల్లి నర్సింగరావు మాట్లాడుతూ పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలని డిమాండ్‌ చేశారు.అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర అంశాలను సహించేది లేదన్నారు. అంబేడ్కర్‌ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎంఆర్‌పీఎస్‌ నాయకుడు చిట్యాల సురేశ్ మాట్లాడుతూ హమారా ప్రసాద్‌ను తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.అంబేడ్కర్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యలు సామాజిక ఉద్రిక్తతలకు దారి తీయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా నాయకులు అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.అంబేడ్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం సామాజిక న్యాయానికి పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మగ్దుంపూర్ వార్డు సభ్యులు పాకాల రాకేశ్, బత్తుల ప్రశాంత్‌, నాయకులు పాకాల భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.