అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం-సకాలంలో స్పందించిన 108 సిబ్బంది -తల్లి, శిశువు ఇద్దరూ క్షేమం

బెజ్జంకి, సెప్టెంబర్ 9(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన కె. బబితకు అంబులెన్స్‌లో సురక్షితంగా ప్రసవం జరిగింది. ప్రసవ సమయం సమీపించడంతో 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి అత్యవసర వైద్య సేవలు అందించారు.108 ఈఎంటీ ఎస్. రాజు ఆధ్వర్యంలో, పైలట్ బి. రాజమల్లు సహకారంతో ప్రసవాన్ని సురక్షితంగా నిర్వహించారు. అనంతరం తల్లి, శిశువును ఆసుపత్రికి తరలించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.అత్యవసర సమయంలో సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించిన 108 అంబులెన్స్ సిబ్బందిని కుటుంబ సభ్యులు...