prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 11:17 am Digital Edition : PRAJA VANI

అందోల్ గురుకుల బాలికల కళాశాలలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

అందోల్ గురుకుల బాలికల కళాశాలలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 15 అందోల్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

అందోల్ గురుకుల బాలికల కళాశాలలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు భక్తిశ్రద్ధలతో వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వినాయకునికి పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. విద్యార్థినులలో భక్తిభావం, ఐక్యతను పెంపొందించేలా కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.