prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 12:47 pm Digital Edition : PRAJA VANI

అంతారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండో విడత ఉచిత యూనిఫారాల పంపిణీ.

అంతారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండో విడత ఉచిత యూనిఫారాల పంపిణీ.

పరిగి , సెప్టెంబర్ 28(ప్రజవాణి):

కుల్కచర్ల మండలం అంతారం మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ఉచిత యూనిఫారాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. హనుమంతు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ చైర్మన్ మాధవీలత, కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఇందిర, వీఏవో శివరాములు, కుల్కచర్ల మండల పీఆర్టీయూ గౌరవ అధ్యక్షులు దగ్గుల వెంకటయ్య ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఉచితంగా యూనిఫారాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు అండగా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం నాణ్యమైన యూనిఫారాలను అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భూదేవి, లావణ్య, రోహిన్ కుమార్, కవిత, శ్రావణి తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.