అంతగిరి పోచమ్మ దేవాలయంలో 27న మహాశక్తి యాగ మహోత్సవం

అంతగిరి పోచమ్మ దేవాలయంలో 27న మహాశక్తి యాగ మహోత్సవం ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేత మహోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఇల్లంతకుంట,సెప్టెంబర్ 20 (ప్రజావాణి) రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అంతగిరి గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానంలో ఈనెల 27న మహారుద్ర, మహాఛండీ సహిత మహాశక్తి యాగ మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆదివారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు దేవస్థానం చైర్మన్ కోలపురి అంతగిరి, సర్పంచ్ నవీన్, ఆలయ...