అంతగిరి పోచమ్మ దేవాలయంలో 27న మహాశక్తి యాగ మహోత్సవం
ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేత
మహోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఇల్లంతకుంట,సెప్టెంబర్ 20 (ప్రజావాణి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అంతగిరి గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానంలో ఈనెల 27న మహారుద్ర, మహాఛండీ సహిత మహాశక్తి యాగ మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆదివారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు దేవస్థానం చైర్మన్ కోలపురి అంతగిరి, సర్పంచ్ నవీన్, ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి మారుతిరావు తదితరులు అందజేశారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించారు. మహాశక్తి యాగ మహోత్సవానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. అనంతరం మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, ఇల్లంతకుంట పాక్స్ చైర్మన్ ఊట్కూరి వెంకట రమణారెడ్డి, పార్టీ నాయకులు, దేవస్థాన ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.