prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:17 pm Digital Edition : PRAJA VANI

అంగరంగ వైభవంగా గంగమ్మ ఒడిలోకి గణనాధుడు

అంగరంగ వైభవంగా గంగమ్మ ఒడిలోకి గణనాధుడు

లద్నూరు 9వ వార్డు గణపతి లడ్డు వేలం 25 వందలు

మద్దూరు సెప్టెంబర్ 22, ప్రజా వాణి,

మండలంలోని లద్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 9వార్డు మాజీ ఉప సర్పంచ్ మల్లారపు రాజు ఆధ్వర్యంలో నెలకొల్పిన విఘ్నేశ్వర స్వామి తొమ్మిది రోజులుగా భక్తుల పూజలందుకొని మంగళవారం భక్తుల సమక్షంలో గణపతి స్వామిని ఘనంగా ఊరేగింపుగా వెళ్ళి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా స్వామి వారి లడ్డును నిర్వాహకులు వేలం వేయగా మానేపల్లీ ధనుష్ 25 వందలకు వేలంలో పాల్గొని దక్కించుకున్నాడు.అనంతరం భక్తులకు స్వామి వారి ప్రసాదం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. దీంతో అంగ రంగ వైభవంగా గంగమ్మ ఒడిలోకి గణనాధున్నీ భక్తులు ఆట పాటలతో చేర్చారు.