అంగన్ వాడీ హెల్పర్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు విడుదల
గోవిందరావుపేట, సెప్టెంబర్ 01 (ప్రజావాణి) ములుగు జిల్లా తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లోని అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీలను సీడీపీఓ హేమలత మంగళవారం ప్రకటించారు.అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కు హాజరు కావాలని స్పష్టం చేశారు.తేదీల వివరాలు... సెప్టెంబర్ 2న గోవిందరావుపేట మండల అభ్యర్థులకు, సెప్టెంబర్ 3న తాడ్వాయి మండల అభ్యర్థులకు తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు పరిశీలన నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు...