prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 7:23 pm Digital Edition : SRIKANTH MULUGU

అంగన్ వాడీ హెల్పర్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు విడుదల

 

గోవిందరావుపేట, సెప్టెంబర్ 01 (ప్రజావాణి) ములుగు జిల్లా తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లోని అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీలను సీడీపీఓ హేమలత మంగళవారం ప్రకటించారు.అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కు హాజరు కావాలని స్పష్టం చేశారు.తేదీల వివరాలు…
సెప్టెంబర్ 2న గోవిందరావుపేట మండల అభ్యర్థులకు, సెప్టెంబర్ 3న తాడ్వాయి మండల అభ్యర్థులకు తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు పరిశీలన నిర్వహిస్తామని తెలిపారు.
అభ్యర్థులు తమ విద్యార్హతలు, పుట్టిన తేదీ, నివాస, కుల ధృవీకరణ పత్రాలతో పాటు ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్లు ఒరిజినల్ మరియు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన జిరాక్స్ ప్రతులను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులు తమ అంగన్ వాడీ కేంద్రం కోడ్, పేరు వివరాలతో హాజరు కావాలని, ఇంటర్వ్యూ తేదీని త్వరలో వెల్లడిస్తామని సీడీపీఓ హేమలత తెలిపారు.