అంగడిపేటలో కప్ప పెళ్లి ఫలించింది – ప్రశాంతంగా దంచికొట్టిన వర్షం – గ్రామస్తుల్లో ఆనందం

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా చండూర్ మండలం అంగడిపేట గ్రామంలో గ్రామస్తుల నమ్మకం నిజమైంది. గ్రామంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదనతో, గ్రామస్తులు ఇటీవల కప్పల పెళ్లి (మండూక వివాహం) వేడుకను ఘనంగా నిర్వహించారు. దేవుడు కరుణించి వర్షం కురిపించాలని పూజలు చేశారు. ఫలితం దక్కింది: గ్రామస్తుల ప్రార్థన ఫలించినట్లుగానే సోమవారం మధ్యాహ్నం అంగడిపేటలో ఒక్కసారిగా భారీ వర్షం దంచికొట్టింది. విశేషం ఏమిటంటే ఎలాంటి ఉరుములు, మెరుపులు లేకుండా ప్రశాంతంగా వర్షం కురవడం. "కప్ప పెళ్లి చేసినందుకే దేవుడు కరుణించి...