80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న హోలీయ దాసరి సంక్షేమ సంఘం
ఘట్‌కేసర్, ఆగస్టు 15: ఘట్‌కేసర్‌లో హోలీయ దాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ సభ్యులు జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో...