40 ఏళ్ల అండర్‌గ్రౌండ్ జీవితానికి స్వస్తి – కాకర్ల సమత లొంగుబాటు.
40 ఏళ్ల అండర్‌గ్రౌండ్ జీవితానికి స్వస్తి - కాకర్ల సమత లొంగుబాటు. *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:- దాదాపు 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సీపీఐ మావోయిస్టు సీనియర్ నాయకురాలు కాకర్ల సమత అలియాస్ మాధవి, షకీలా, దుర్గా ములుగులో డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆమెకు ప్రభుత్వ పునరావాస నిధుల కింద రూ.20 లక్షల చెక్ ను డీజీపీ అందజేశారు. 1985లో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిన సమత.. హైదరాబాద్, నల్లమల, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు నిర్వహించారు....