కర్కాల గ్రామంలో సీజ్ చేసిన ఇసుక వేలం తొర్రూర్ మండలంలోని కర్కాల గ్రామ పంచాయతీ పరిధిలో 224 ట్రిప్పుల అక్రమ ఇసుక నిలువలు ఉన్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక తహశీల్దార్ గడీల శ్రీనివాస్ కర్కాల గ్రామానికి వెళ్లి ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ కర్కాల గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, కర్కాల గ్రామములో పొలాల వద్ద, ఇండ్ల ముందర అక్రమంగా నిల్వవుంచిన సుమారు (224) ట్రిప్పుల ఇసుకను సీజ్ చేయడం జరిగిందని. అట్టి నిల్వ ఉంచిన...