prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 6:43 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

కర్కాల గ్రామంలో సీజ్ చేసిన ఇసుక వేలం

తొర్రూర్ మండలంలోని కర్కాల గ్రామ పంచాయతీ పరిధిలో 224 ట్రిప్పుల అక్రమ ఇసుక నిలువలు ఉన్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక తహశీల్దార్ గడీల శ్రీనివాస్ కర్కాల గ్రామానికి వెళ్లి ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ
కర్కాల గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, కర్కాల గ్రామములో పొలాల వద్ద, ఇండ్ల ముందర అక్రమంగా నిల్వవుంచిన సుమారు (224) ట్రిప్పుల ఇసుకను సీజ్ చేయడం జరిగిందని. అట్టి నిల్వ ఉంచిన సుమారు (224 ) ట్రిప్పుల ఇసుకను ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి బహిరంగ వేలంపాట వేయుటకు తేదీ 27-08-2026 , ఉదయం గం. 11.30 నిమిషాలకు గ్రామపంచాయతి కార్యాలయము, కర్కాలలో నిర్వహించబడునని ఆయన తెలిపారు. సీజ్ గావించబడిన వివరములు ఈ దిగువ చూపబడిందని ఇసుక నిల్వ ఉంచబడిన ప్రదేశం మరియు అట్టి స్థలం యొక్క యజమాని పేరు
ఎర్ర వెంకటేశ్వర్లు తండ్రి యాకయ్య ఇంటి ఆవరణ 12 ట్రిప్పులు,
ఎర్ర సంజీవ తండ్రి సాయిరెడ్డి ఇంటి ఆవరణ 20,
ఎర్ర రామన్న తండ్రి సాయిరెడ్డి ఇంటి ఆవరణలో
20,
ఎర్ర నర్సిరెడ్డి స్వంత స్థలం15
సింగిరెడ్డి రవి ఇంటి ఆవరణ20
పెంచల మల్లారెడ్డి (శ్రీ అనుముల చిన్న నర్సయ్య) స్థలం వద్ద15,
ఎద్ద రాజమల్లారెడ్డి ఇంటి ఆవరణలో8,
సిగ్గం కొమురెల్లి (శ్రీ అలువాల మదుసూదన్ స్థలం వద్ద 8,
దూకుంట్ల చింటు(శ్రీ సిగ్గం రాంమూర్తి) స్థలం వద్ద10,
ఉడుత లింగమల్లు స్వంత స్థలం10,
ఎర్ర పద్మా రెడ్డి (శ్రీ ఎర్ర రామలింగా రెడ్డి) ఇంటి పక్కన సిసి రోడ్12
కడుదుల మురళి స్వంత స్థలం 4,
కడుదుల రవి తల్లి స్థలం.4,
ఇంతల లింగయ్య (శ్రీ కడుదుల రవి’) ప్లాట్ వద్ద 10,
నంగునూరి సైదులు (శ్రీ నంగునురి కట్టమల్లు) వ్యవసాయ భూమి వద్ద12,
కుస మహేష్ (శ్రీమతి రావిపల్లి రాజమ్మ) వ్యవసాయ భూమి వద్ద10,
సిగ్గం సతీప్ స్వంత స్థలం8,
ఎర్ర పెద్ద చంద్రయ్య స్వంత స్థలం1 ఇసుక నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు, కావున రెవెన్యూ కార్యాలయం ఆధ్వర్యంలో కర్కాల గ్రామపంచాయతీ కార్యాలయం ముందు జరుగు వేలంపాటలో పాల్గొని, అవసరం ఉన్నవాళ్లు ఈ ఇసుకను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.