దళిత రత్నం అవార్డు అందుకున్న ప్రజా గాయకుడు గిద్దె రాంనర్సయ్య ప్రముఖ ప్రజా గాయకుడు గిద్దె రాంనర్సయ్య కి దళిత రత్నం అవార్డు లభించిన సందర్భంగా శనివారం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా దళిత రత్నం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా గాయకుడిగా గిద్దె రాంనర్సయ్య ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో, సామాజిక సమస్యలపై అవగాహన...