.పసర సెయింట్ మేరీస్ విద్యార్థుల దేశభక్తి ప్రదర్శన వైరల్.
152 మీటర్ల జాతీయ జెండాతో దేశభక్తి జోష్ సెయింట్ మేరీస్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన
కరస్పాండెంట్ స్టీఫెన్ రెడ్డి
ముఖ్య అతిథి పసర ఎస్సై తాజుద్దీన్
*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్(ప్రజావాణి)*
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరలో సెయింట్ మేరీస్ పాఠశాల దేశం గర్వించేలా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిపించారు.
ఈ సందర్భంగా పస్రా గ్రామంలోని ప్రముఖ విద్యాసంస్థ సెయింట్ మేరీస్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. 500 ఫీట్లు
152 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
ఉదయం నుండే పాఠశాల ప్రాంగణం జాతీయ జెండాలతో, త్రివర్ణ పతాకాలతో అలంకరించబడింది.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు త్రివర్ణ దుస్తులతో పాఠశాలకు చేరుకున్నారు.
జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్టీఫెన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు.అనంతరం సెయింట్ మేరీస్ విద్యార్థులు చేతుల్లో 152 మీటర్ల భారీ జాతీయ జెండాను పట్టుకున్నారు.”భారత్ మాతా కీ జై” నినాదాలతో జాతీయ రహదారి పైకి ర్యాలీ బయలుదేరింది.ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారి అడుగులకు రోడ్డంతా కదిలినట్లు అనిపించింది.భారీ జెండా రోడ్డుపై సాగుతున్న తీరు చూసేందుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు.చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ సెల్ఫీలు తీసుకున్నారు.విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ర్యాలీలో నడిచారు.”సారే జహా సే అచ్చా” పాటకు ప్రజలు కూడా గొంతు కలిపారు.ప్రతి అడుగులో దేశభక్తి కనిపించింది. ప్రతి ముఖంలో గర్వం కనిపించింది.పోలీసులు ర్యాలీకి పూర్తి సహకారం అందించారు.స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ర్యాలీని స్వాగతించారు.పూలవర్షం కురిపించి విద్యార్థులను అభినందించారు.152 మీటర్ల జెండా గాలిలో రెపరెపలాడుతుండగా చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి.ఇది కేవలం ర్యాలీ కాదు, దేశం పట్ల మన బాధ్యతకు గుర్తు అని అన్నారు.
*పసర ఎస్సై తాజుద్దీన్*
మాట్లాడుతూ
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను మనం మర్చిపోకూడదని,
విద్యార్థులు దేశ సేవకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ములుగు జిల్లాలో
జాతీయ జెండాతో ర్యాలీ చేయడం ఉమ్మడి వరంగల్ ములుగు జిల్లాలో పసర సెయింట్ మేరీస్ పాఠశాల
విద్యార్థుల క్రమశిక్షణను ఎస్సై అభినందనలు తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ర్యాలీలో పాల్గొనడం విశేషమని ర్యాలీ ముగింపులో జాతీయ సమైక్యతపై
దేశభక్తి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయని ఈ సందర్భంగా తెలిపారు.