పోరుమామిళ్లలో ప్రభుత్వ డాక్టర్ ‘శశి హాస్పిటల్’ దందా? అనుమతులపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైద్యాధికారులు! పోరుమామిళ్ల,ఆగస్టు 13:వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలో నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సర్కిల్ సమీపంలో కొత్తగా వెలిసిన‘శశి హాస్పిటల్’ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది.ప్రభుత్వ సేవల్లో ఉంటూ,ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.శశివర్ధన్ రెడ్డి ఈ ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ వైద్యుడే స్వయంగా ప్రైవేట్ వ్యాపారంలోకి దిగడం ఒకెత్తయితే,ఈ ఆసుపత్రికి కనీస...