23న గణపురంలో బోనాల పండుగ…గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయం.. ముఖ్య అతిథిగా వేముల మహేష్ గౌడ్
ఘట్‌కేసర్, ఆగస్టు 09: ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ గణపురం గ్రామంలో బోనాల పండుగను ఈ నెల 23న ఘనంగా నిర్వహించాలని గ్రామ పెద్దలు, నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పండుగ ఏర్పాట్లు, కార్యక్రమాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. గ్రామ ప్రజలంతా...