22ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి 31న సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ మహాధర్నా
నంగునూరు, ఆగస్టు 29: రైతుల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31న సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు నంగునూరు మండల బీజేపీ అధ్యక్షుడు చౌడు చెర్ల వెంకట్రాంరెడ్డి తెలిపారు. శనివారం నంగునూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉదయం 10 గంటలకు జరిగే ఈ ధర్నాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, ఎంపీలు మాధవనేని రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని...