prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 5:38 pm Digital Edition : RAJU NANGUNOOR

22ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి 31న సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ మహాధర్నా

నంగునూరు, ఆగస్టు 29: రైతుల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31న సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు నంగునూరు మండల బీజేపీ అధ్యక్షుడు చౌడు చెర్ల వెంకట్రాంరెడ్డి తెలిపారు. శనివారం నంగునూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉదయం 10 గంటలకు జరిగే ఈ ధర్నాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, ఎంపీలు మాధవనేని రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. 22ఏ జాబితా కారణంగా నష్టపోతున్న రైతుల తరఫున బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. నంగునూరు మండలం నుంచి రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి గుండ్ల జనార్ధన్, తొడుకునూరి వెంకటేశం, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రజనీకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పరకాల తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి యాజమళ్లు, మండల ప్రధాన కార్యదర్శి బండి సతీష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, సతీష్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, వస్తాదుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.