prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 5:42 pm Digital Edition : MAHESH MEDCHAL

2వ రోజుకు చేరిన మయూర ఇండియా కంపెనీ సమ్మె

*2వ రోజుకు చేరిన మయూర ఇండియా కంపెనీ సమ్మె*

మేడ్చల్ పరిధిలోని మయూర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగులు చేస్తున్న సమ్మె 2వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు మద్దతుగా మేడ్చల్ జిల్లా బి ఆర్ టి యు అధ్యక్షుడు సంబు ప్రభాకర్ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబు ప్రభాకర్ మాట్లాడుతూ చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌పై తక్షణమే చర్చలు జరిపి న్యాయబద్ధమైన పరిష్కారం కుదుర్చుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కార్మికులపై కక్షసాధింపు చర్యలు, వేధింపులు నిలిపివేయాలని ఆయన కోరారు. 2022లో కోత విధించిన KTP ఇన్సెంటివ్స్‌ను చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.