15వ అంతస్తు నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి

ఘట్‌కేసర్, ఆగస్టు 8 (ప్రజా వాణి): మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పోచారం డివిజన్‌ పరిధిలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలోని 15వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిన ఓ భవన నిర్మాణ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జాతీయ రహదారిని ఆనుకుని హరిహర కన్స్ట్రక్షన్స్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కాకతీయ అపార్ట్‌మెంట్స్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన వినోద్‌ అనే కార్మికుడు శనివారం అపార్ట్‌మెంట్‌ 15వ...