‘హర్ ఘర్ తిరంగా’తో దేశభక్తిని చాటాలి…బీజేపీ మండల అధ్యక్షుడు బస్వరాజు గౌడ్
ఘట్‌కేసర్, ఆగస్టు 10 (ప్రజావాణి): ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ ఘట్‌కేసర్ మండల అధ్యక్షుడు బస్వరాజు గౌడ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు, రాష్ట్ర, జిల్లా పార్టీ సూచనలతో నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఘట్‌కేసర్ మండల బీజేపీ ఆధ్వర్యంలో ఎదులాబాద్ బీసీ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్వరాజు గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం దేశభక్తి నినాదాలు చేశారు. ఆయన...