హత్య కేసు ఛేదింపులో ప్రతిభ: పోరుమామిళ్ల కానిస్టేబుల్ బాల పీరయ్య కు డీఎస్పీ రివార్డు

పోరుమామిళ్ల,ఆగస్టు 28 ప్రజావాణి కలసపాడు మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసును ఛేదించడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వి.బాలపీరయ్య (PC 3427) ని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా అభినందించి,రివార్డు అందజేశారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర ఎకరా 30 సెంట్ల భూవివాదం నేపథ్యంలో రూ.6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఈ వృద్ధుడి హత్య కేసులో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్లిష్టమైన కేసు దర్యాప్తులో పోరుమామిళ్ల కానిస్టేబుల్ బాల...